మంథని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపిపి

జనంసాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను ఎంపీపీ కొండ శంకర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందించే పాలల్లో నాణ్యత లేదని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైస్ ఎంపిపి కొమ్మిడి స్వరూప్ రెడ్డి, వైద్యులు అవినాష్ ఉన్నారు.

తాజావార్తలు