Wednesday, 4 November 2026

మందమర్రిలో కార్డన్‌ సెర్చ్‌

మంచిర్యాల,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): మందమర్రిలోని విద్యానగర్‌, రాజన్నల కాలనీలలో ఏసీపీ బాలు జాదవ్‌ ౠధ్వర్యంలో 100 మంది పోలీసులు కార్దేన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఎలాంటి పత్రాలు లేని 82 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన వాహనాల యజమానులకు పోలీసులు నోటీసులు అందజేసినారు. కాలనీలలో ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుండా భద్రతలో భాగంగా ముందస్తుగా తనిఖీలు నిర్వహించడం జరగుతుందని ప్రజలు సహాకరించాలని కోరారు. ప్రతి కాలనీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు.