మగ్గిడి ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు20:ఆర్మూర్ మండలం లో
మగ్గిడి ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరింది.ఈ వేడుకలో బాలికలు గోపికలాగా, బాలురు కృష్ణుడి లాగా వేషాధారణలో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ నర్సయ్య, ప్రధానోపాధ్యాయుడు గోపి గంగాధర్, ఉపాధ్యాయులు సునీత,శిరీష,స్వప్న, కల్పన, వసంత,శ్రీజ, తదితరులు పాల్గోన్నారు.