మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన తెరాస నాయకులు
జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 31: మండలంలోని సుందరగిరి గ్రామంలో బుధవారం తెరాస గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ సూచన మేరకు గ్రామంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన తెరాస నాయకులు. గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రామోజీ కృష్ణమాచారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షులు రామోజు కృష్ణమాచారి, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కొమ్ము కొమురయ్య, ఉప సర్పంచ్ జంగ శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.