మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పర్యావరణహిత వినాయక ప్రతిమలనే పూజించాలని శ్రీరామ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్యామ్ ప్రసాద్ అన్నారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక అలంకార్ బజార్ లో శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బంక మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ప్రతిష్టించి,పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.దాదాపుగా 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు గుడిపాటి సురేష్ , ప్రధాన కార్యదర్శి గుండా శంకర్ , కోశాధికారి విజయ శంకర్, రేపాల యాదగిరి , కాసం జగన్, బుగ్గారపు శ్రీను , రంగనాథ్ , ఏకాంబరం,  ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.