Thursday, 5 November 2026

మణిపూర్ అకృత్యాలపై జరిగే నిరసన సభను విజయవంతం చేయండి-మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రాగుల రాములు.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 23. (జనంసాక్షి). బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ మణిపూర్ హర్యానాలో చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఈనెల 25న సిరిసిల్లలో జరిగే సభను విజయవంతం చేయాల్సిందిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రాగుల రాములు కోరారు. బుధవారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాగుల రాములు మాట్లాడుతూ బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ పాలనలో పౌరులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మణిపూర్ హర్యానాలో జరుగుతున్న అకృత్యాలు హింస ఖండవెనుక హిందుత్వ మతోన్మాదుల ప్రమేయం ఉందని అన్నారు. అకృత్యాలను ఎండగడుతూ ఈనెల 25న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి గాజుల మల్లయ్య కళ్యాణ మండపం వరకు ప్రదర్శన అనంతరం సభ ఉంటుందని తెలిపారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో చేన్నమనేని పురుషోత్తం రావు, బొజ్జ కనకయ్య, బొడ్డు రాములు, గుండా థామస్, కంసాల మల్లేశం, సాయికుమార్ పాల్గొన్నారు.