Thursday, 5 November 2026

కౌన్సెలింగ్ మరియు ట్రైనింగ్ అంశాలపై డాక్టరేట్ సాధించిన భాను శిరీష

భాను శిరీష గారు చేస్తున్న సమాజ సేవలు మరియు ఆధ్యాత్మిక సేవలు ఎంతో ప్రశంసనీయం. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సినేషన్, కరోనా సోకిన కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ,ఎంతో మందికి బ్లడ్ ,ఆక్సిజన్, మెడికల్ సంబంధించిన అవసరాలను తీర్చారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ పంపిణీ చేశారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 10 రోజుల్లో,1000 గ్రామాలు,10 మిలియన్ మందికి బియ్యం,కందిపప్పు,గోధుమ పిండిని డోనొర్స్ సహకారంతో రాబిన్ హుడ్ సంస్థ ద్వారా అందచేయడం జరిగింది.హెల్త్ అండ్ హైజిన్ అనే అంశం మీద బ్రహ్మ సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలకు అవగాహన కల్పించడం, ఇంకా ఆధ్యాత్మిక సర్వీసులనెన్నో అందించారు. మహిళ లందరికీ ఆదర్శంగ నిలిస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా శ్రీమతి భానుశిరీష శేషు కుమార్ గారు సేవా దృక్పథం తో మరింతగా ముందుకెళ్లాలి అని వారి సేవలు గుర్తించి భాను శిరీష గారికి గ్లోబుల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సంస్థ ద్వారా హ్యూమన్ సర్వీసెస్ కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ అంశములపై డాక్టరేట్ డిగ్రీని రవీంద్రభారతి, హైదరాబాదు నందు ఆ సంస్థ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ హెచ్ ఆర్ రహమాన్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ సంస్థ ఇంటర్నేషనల్ లో పనిచేయడం జరుగుచున్నది. అనేక అంశాల పైన విశ్లేషణ చేసిన వారికి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అందులో భాగంగా కౌన్సిలింగ్ మరియు శిక్షణ అంశములపై కృషి చేసినందుకు గాను భాను శిరీష గారికి ఈ అవార్డును ప్రధానం చేశారు.గృహిణిగా, మాతృమూర్తిగా, అందరికీ మంచి స్నేహితురాలిగా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తోటి వారికి చిన్న చిన్న చేయూత అందిస్తూ,ఉపాధి అవకాశలు చూపిస్తున్నారు.డాక్టరేట్ పొందిన తర్వాత భాను శిరీష గారు మాట్లాడుతూ ఇన్ని సర్వీసెస్ చేయడానికి,ఇన్ని అవార్డ్స్ పొందడానికి తల్లిదండ్రులు పెంచిన విధానం,నేర్పించిన విలువలు మరియు భర్త,పిల్లలు సహకారం వల్లనే సాధించాను అని చెప్పారు.