మతతత్వ బీజేపీని కేంద్రంలో గద్దె దింపాలి
..కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 15,( జనం సాక్షి) :
మతతత్వ బిజెపిని కేంద్రంలో గద్దె దింపాలని, టీ ఎస్ సంక్షేమపథకాలు దేశంలో అమలుచేసే విధం గా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కి రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నాను.స్టేషన్ ఘనపూర్ మండ ల కేంద్రంలోని శివునిపల్లి గ్రామ పరిధిలోని కెఅర్ గార్డెన్స్ లో స్టేషన్ ఘనపూర్, చిలుపూర్, జఫర్ గడ్,రఘునాథ్పల్లి,లింగాలఘనపూర్, ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన వివిధ గ్రామాల లబ్ధి దారులకు సీఎం సహాయనిధి చెక్కులు మాజీ ఉపముఖ్యమంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి 29 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 70 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం రూరల్ రైస్ మిల్లర్సుఅసోషియేషన్ జిల్లా అధ్యక్షు డు,టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి గా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ కుల, మతతత్వ బీజేపీని కేంద్రంలోగద్దెదింపి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో అమలు చేసేందుకు బీజేపీపై పోరాటం చేయాలని అన్నారు. బిజెపి నాయకులు కుల, మ తాల విద్వేషాలను రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో గెల వాలని చూస్తుందన్నారు.రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ప థకాలను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నారన్నారు. టిఆర్ఎస్ ను విమర్శించే బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు విభ జన చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సి టీ, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు గను ల ఫ్యాక్టరీ ఎందుకు తేలేదని ప్రశ్నించారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ను దేశంలో అమలు చేసేందుకు మతతత్వ బీజే పీని ఓడించాలని పిలుపునిచ్చారు.ప్రపంచ మేధా వి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరునుపార్లమెంటుకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంక న్న,గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ బూర్ల లతశంకర్,నాయకులు పోగుల సారంగపా ణి, మామిడాల లింగారెడ్డి, బూర్ల శంకర్, పెసరు రమేష్,కోతి రాములు,రాజేష్ నాయక్, రాపోలు మధుసూదన్ రెడ్డి, ఐలోని సుధాకర్,రజాక్, రాజు కరుణాకర్ రావు,ఐలోని రాజు,పోకల నారాయణ, దేశిని సతీష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.