|
ఖైరతాబాద్: సెప్టెంబర్ 15 (జనం సాక్షి) ఆహార శక్తిని అందరికి చేరువ చేయాలనే సదుద్దేశంలో భాగంగా నూతన ఆవిష్కరణలు చేయాలనే నెస్లే ఇండియా నిబద్ధతకు అనుగుణంగా నెస్లే సెరెగ్రో తన పోర్ట్ పోలియోను విస్తరిస్తూ కొత్త సబ్ బ్రాండ్ సెరెగ్రో ‘గ్రెయిన్ సెలెక్షన్’ను ప్రారంభించింది. ఇది ప్రధాన పదార్ధాలతో ఈ శ్రేణిలో ప్రారంభించబడిన 1 వ ఉత్పత్తి. ఇది పసిపిల్లల కోసం రాగులు, మిశ్రమ పండ్లు, నెయ్యితో తయారు చేయబడి పోషకాలతో నిండిన ఒక గొప్ప తృణధాన్యం. ఆవిష్కరణపై నెస్లే ఇండియా న్యూట్రిషన్ బిజినెస్ హెడ్ వినీత్ సింగ్ మాట్లాడుతూ మహమ్మారి తర్వాత, తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంలో ప్రాథమిక ఆరోగ్యకరమైన పదార్థాలు, రెసిపీలను ఏకీకృతం చేయడానికి, అలాగే భరోసా ఇవ్వబడిన పోషణతో కూడిన మార్గాలను ఎక్కువగా వెతుకుతున్నారన్నారు. నెస్లీ సెరెగ్రో పాలు, పండ్లతో కూడిన మల్టీగ్రెయిన్ తృణధాన్యాలు పూర్తి పోషకాహారం, పూర్తి భరోసా(పూర పోషణ, పూరి తసల్లి) వాగ్దానంతో ఇటీవలి కాలంలో మా అత్యంత విజయవంతమైన ఆవిష్కరణలలో ఒకటి అన్నారు. మేము సరికొత్త సెరెగ్రో గ్రెయిన్ సెలక్షన్ రాగి మిక్స్డ్ ఫ్రూట్స్, నెయ్యి, తల్లులు తమ పసిపిల్లల ఆహారంలో సాంప్రదాయక పదార్థాలను పోషకమైన, రుచికరమైన రూపంలో చేర్చడంలో సహాయ పడుతుందన్నారు. భారత దేశంలో ప్రధాన ఆహార పదార్థాలలో మిల్లెట్లు అంతర్భాగంగా ఉన్నాయన్నారు. సెరెగ్రో గ్రెయిన్ సెలెక్షన్ టీఎం అనేది ఈ సాంప్రదాయ మిల్లెట్ల విలువను తిరిగి పొందడానికి ఒక గొప్ప తృణధాన్యం అన్నారు. కొత్త సెరెగ్రో గ్రెయిన్ సెలక్షన్ రాగి, మిక్స్డ్ ఫ్రూట్, ఘీ భారతదేశంలోని ప్రధాన రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందన్నారు.
|




