Tuesday, 3 November 2026

మతిభ్రమించిన కవ్వంపల్లి… రసమయి పై అనుచిత వ్యాఖ్యలు వైస్ ఎంపీపీ రమేష్…

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 4
ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తు, అధికారం కోసం మతిభ్రమించి , మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కత రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ పై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని, చేస్తున్నాడని రసమయిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూనట్లు శంకరపట్నం మండల పరిషత్ వైస్ ఎంపీపీ పులికోట రమేష్, మండల దళిత సర్పంచులు దాసారపు భద్రయ్య, కొండ్ర రాజయ్య, టిఆర్ఎస్ నాయకులు క్యా దాసి భాస్కర్ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఈనెల 3న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మతిభ్రమించి అధికారం అందడం లేదని అక్కస్సుతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తన ప్రాణాలను తెగించి ఆంధ్ర పాలకులపై ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించి తన కంఠంతో తెలంగాణ కష్టాలను గుర్తించి ధూంధాం ప్రోగ్రాములు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి పోరాటం చేసిన వ్యక్తి, కవ్వంపల్లి సత్యనారాయణ నాటి నుంచి నేటి వరకు ఊసరవెల్లి గడియ గడియకు ఎన్ని రంగులు మారుస్తుందో, నీవు అన్ని పార్టీలు మారావు మారావు మానకొండూర్ నియోజకవర్గం ప్రజలు, ఓటర్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుండెలకు అద్దుకొని రెండుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ముచ్చటగా మూడోసారి మానకొండూర్ ఓటర్లు, ప్రజలు రసమయిని అక్కున చేర్చుకొని, ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పారు. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వసినా నీకు ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని మానకొండూరు ప్రజలు ఇవ్వరని,మతిభ్రమించి ఎమ్మెల్యే రసమయిపై వ్యక్తిగత దూషణలు చేయడం పలికారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రసమయిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే దళిత బిడ్డవని చూడకుండ తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు .ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు సోమిడి తిరుపతి , కనకం శంకర్, అంతడుపుల సతీష్, ఆర్ అంజయ్య, ఎస్ చిరంజీవి, తోపాటు తదితరులు పాల్గొన్నారు.