Wednesday, 4 November 2026

మత్తడి పోచమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే!

లింగంపేట్ 24 మార్చి (జనం సాక్షి)
లింగంపేట్ మండల కేంద్రంలోని  మతడి పోచమ్మ దేవాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తడి పోచమ్మ జాతరకు మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి ఇతర రాష్ట్రాల్లో నుండి భక్తులు భారీగా పెరగడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీళ్లు,రోడ్డు సౌకర్యం 2 కోట్లతో సీసీ రోడ్డును  ఏర్పాటు చేస్తున్నామన్నారు, త్వరలోనే పూర్తి చేయాలని స్థానిక నాయకులకు చెప్పడం జరిగింది,ఈ పండుగ సందర్భంగా ప్రజలంతా సుఖ శాంతితో ఉండాలని వర్షాలు సమృద్ధిగా పడాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేష్, వైస్ చైర్మన్ సిద్ధరాంరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ నరహరి,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీను, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బండి రాజు,శ్రీకాంత్,పీర్ సింగ్, మండల నాయకులు పాల్గొన్నారు.