మత్స్యకారులకు అండగా సీఎం కేసీఆర్
– ఎంపీపీ గంగం స్వరూప
రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి)
మత్స్యకారులు ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంమని వారికి అండగా ఎల్లవేళలా తెరాస ప్రభుత్వం ఉంటుందని ఎంపీపీ గంగం స్వరూప అన్నారు.శనివారం
మానాల పెద్ద చెరువులో సమీకృత మత్స్య పథకం ద్వారా అందజేసిన చేప పిల్లలను వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య,మత్స్యకార సభ్యులతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికాభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు.100 శాతం సబ్సిడీతో 15000 ల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగం మహేష్,ఇండ్ల లస్మయ్య,తునికి నర్సయ్య, గుర్రపు సాయన్న,పిసరి రవీందర్, బోయిని నర్సయ్య,తునికి మహేష్,దండవేని నర్సయ్య,దాసరి గంగ నర్సయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.