తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 21 :: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రోత్సహిస్తుందని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో లక్ష అరవై వేల చేప పిల్లలను వదిలిన సందర్భంగా అనంతరం ఆమె మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తూలను ప్రోత్సహిస్తుందని మత్స్యకారులకు గంగపుత్రులకు ఉచితంగా చేపల పంపిణీ చేస్తునదని దీనివల్ల మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతారని వారికి వాహనాల సౌకర్యం సైతం ప్రభుత్వం ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్ గౌడ్ ఆత్మ కమిటీ సభ్యులు బిక్షపతి వార్డు సభ్యులు బాలేష్ గంగ పుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి




