మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి
నల్లబెల్లి సెప్టెంబర్ 28 ( జనం సాక్షి):
మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ ఊడుగుల సునీత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు, గుట్ట చెరువు లలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను ఎంపీపీ పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ తో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. చేప పిల్లల పంపిణీ తో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్ గౌడ్, సర్పంచులు నాన బోయిన రాజారాం, ఊరటి అమరేందర్, ఎస్సై నార్లాపురం రాజా రాం, టిఆర్ఎస్ మండల నాయకులు శ్రీనివాస్, రాంబాబు, నాగేశ్వరరావు, దామ సాంబయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.