బాలస్వామి లింగమ్మ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (జనంసాక్షి):మత్స్యకార సంఘాల పై దాడి చేయడంతో పాటు కుమ్మెర గ్రామంలో తెలుగు బాలస్వామి లింగమ్మ పై దాడి చేసిన మధుసూదన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకొని శిక్షించకపోతే సహించేది లేదని జిల్లా తెనుగోళ్ళ మిత్ర బృందం జిల్లా కార్యదర్శి గూళ్ళ హరికృష్ణ ముదిరాజ్ మండిపడ్డారు. కుమ్మెర గ్రామంలో దాడికి గురైన కుటుంబాన్ని శనివారం సంఘం నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయలు అమ్ముతున్న బాధితులపై అదే గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు దాడి చేయడం జరిగిందని,మహిళా అని చూడకుండా విచక్షణను కోల్పోయి దాడి చేసిన ఆయనపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన దాడులు తప్పవని హెచ్చరించారు.బీసీ సామాజిక వర్గమైన తెనుగోళ్ల పై దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది గొర్ల శ్రీనివాస్ నాయకులు డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ మల్లయ్య సహదేవుడు సలేశ్వరం తిరుపతయ్య భీమయ్య తదితరులు పాల్గొని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.




