మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): రాష్ట్రంలో ఆక్వా, ఫిషరీస్ రంగాలకు మంచి డిమాండ్ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్యరంగంపై ఆధారపడిన 30 లక్షల కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు. వీరందరిని ప్రతో/-సహించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉచిత చేపవిత్తనాలు, వలలను పంపిణఱీ చేసిందన్నారు. బేగంపేట హరితప్లాజాలో మత్స్యరంగం అభివృద్ధిపై సోమవారం సదస్సు జరిగింది. సదస్సును జ్యోతి ప్రజల్వన చేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ. మత్స్యకార కుటుంబాల అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 75 నుంచి 80 లక్షల చేప పిల్లలు ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు. మత్స్య ఉత్పత్తి, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. నీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్‌తో మత్స్య ఉత్పత్తికి మరింత అవకాశం పెరిగిందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. వారికి అన్ని విధాల అండగా ఉండాలనే నాణ్యమైన చేపవిత్తనాలు పంపిణీ చేశామని అన్నారు. ఈ రంగంలో ఇప్పుడిప్పుడే మంచి ఫళితాలు అందుకుంటున్నారని, మత్స్య సంపద కూడా బాగా పెరిగిందన్నారు. చెరువ్లో నీరు ఉన్న కారణంగా మత్స్యకారులకు ఉపాధి దక్కిందన్నారు. రానున్న రోజుల్లో అవకాశాలు మరింత విస్తృతం కానున్నాయని అన్నారు.




