Friday, 6 November 2026

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం

 చింతలపాలెం  జనంసాక్షి

సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం, కిష్టాపురం గ్రామం మత్స పారిశ్రామిక సహకార సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షేక్ బడేసాబ్ తెలిపారు. అధ్యక్షులుగా శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులుగా తోకల వెంకట్రావ్,ప్రధాన కార్యదర్శిగా గొర్రె చిన్న బ్రహ్మయ్య మరియు ఆరుగురు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు