Friday, 6 November 2026

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది..సుదీర్ రెడ్డి

ఎల్బీ నగర్( జనం సాక్షి)  బాధిత భార్య శేశమ్మ కి 2,00,000 రూపాయల చెక్కు ఆందజేసారు. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సూర్యోదయ కాలనీకు చెందిన వీరస్వామి గారు గుండెనొప్పి సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో హాస్పిటల్ నందు చేరిక కావడం జరిగింది.వారికి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది.అనంతరం వారు డిశ్చార్జి కావడం జరిగింది. అనంతరం వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారిని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి గారు అట్టి ఆపరేషన్ కు అయిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.దానికి గాను వారికి 2,00,000(రెండు లక్షల రూపాయలు)చెక్కు మంజూరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి గారు మాట్లాడుతూ..పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల.విఠల్ రెడ్డి,ఆనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి,చెరుకు ప్రశాంత్ గౌడ్,నర్సింహారావు,శంకర్ గార్లు పాల్గొన్నారు.
Attachments area