మద్దూరు ఆగస్టు 21 (జనం సాక్షి)

కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో కొడంగల్ నియోజకవర్గం లోని మద్దూరు మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ శ్రేణులు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు . ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో మద్దూరు మండలం నుండి భారీ మెజార్టీని ఇస్తామని టిఆర్ఎస్ శ్రేణులు ప్రకటించారు.