హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ, ఆంధప్రదేశ్ రెండు రాష్టాల్ర బేవరేజెస్ కార్పొరేషన్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ. 1500 కోట్లకు పైగా పన్ను చెల్లించాలని ఐటీశాఖ ఈ నోటీసులు జారీ చేసింది. దాంతో ఏజీ సూచన మేరకు అధికారులు మద్యం దుకాణాలకు సరఫరా నిలిపివేశారు. తెలంగాణలో 17, ఏపీలో 22 కేంద్రాల నుంచి దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. దీంతో రెండు బేవరేజెస్ కార్పొరేషన్లు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నాయి. అలాగే ఈ చర్యల కారణంగా ఎపి ,తెలంగాణ ప్రభుత్వాలకు ఆదాయపు పన్ను శాఖ నుంచి కొత్త తలనొప్పి వచ్చింది. ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఈ రెండు రాష్టాల్రకు ఇది సరికొత్త సమస్య అవుతుంది




