Monday, 2 November 2026

ర్యాష్ డ్రైవింగ్ తో ‘మైనర్’ బీభత్సం


నారాయణగూడ(హైదరాబాద్‌): నగరంలోని ఓ వ్యాపారి కుమారుడు తప్పతాగి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్‌(18) తన నలుగురు మిత్రులతో కలిసి మద్యం తాగి స్కోడా కారులో వెళ్తూ శనివారం ఉదయం అంబర్‌పేట డీడీకాలనీలో నాలుగు కార్లు, ఒక బైక్‌ను ఢీకొట్టి స్థానికులను భయ బ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనలో కారు ఢీకొని ఓ వ్యక్తి సినీ ఫక్కీలో ఎగిరి ఢీకొట్టిన కారుపై పడి అక్కడి నుంచి నేలమీద పడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన యువకుడు అభిషేక్‌కు కూడా గాయాలవడంతో పోలీసులు అదుపులోకి తీసుకిని ఆసుపత్రికి తరిలించారు. అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *