హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ నేటి మధ్యాహ్నం అనంతరం మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదుకు అనుమతివ్వాలంటూ ఏసీబీ అధికారులు గతవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు నేడు మేజిస్ట్రేట్ ముందు స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు చేయించనున్నారు.




