అడిషనల్ కలెక్టర్ చిత్ర మీశ్ర.కోటగిరి ఫిబ్రవరి 7 జనం సాక్షి:-ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికై విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యను అభ్యసించెందుకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మన బడి పనులను నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్ర మీశ్ర పరిశీలించారు.ఈ మేరకు మంగళ వారం పోతంగల్ మండల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ మండల అధికారితో కలిసి మన ఊరు మనబడి పనులను సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె ఉమ్మడి కోటగిరి మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన 17 పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై టెక్నికల్ డిపార్ట్మెంట్,మండల విద్యా వనరుల,రెవిన్యూ,ప్రజా పరిషత్ అధికారులతో కలిసి మాట్లాడి పనుల పురోగతిపై ఆరా తీశారు.అదేవిధం గా మరో మూడు రోజుల్లో ఉమ్మడి మండలాలలో మన ఊరు మనబడి పనులను పరిశీలిస్తా నని,అలాగే సంబంధిత అన్ని శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు,కాంట్రాక్టర్లు అందుబాటులో ఉండాలన్నా రు.ఆమె వెంట మన ఊరు మనబడి డిఈ అంజిరెడ్డి, ఎంఈఓ నాగ్ నాథ్,ఎమ్మార్వో రమేష్,ఎంపీడీవో మారుతి, స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, గ్రామ సెక్రెటరీ యాదవ్, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రెడ్డి,రమేష్, తదితరులు ఉన్నారు.





