Tuesday, 3 November 2026

మన ఊరు- మనబడి పనులు ప్రారంభించిన ఎం ఈ ఓ

జులై 14( జనం సాక్షి )
 మండలంలోని మహందాపూర్ ఉన్నత పాఠశాలను గురువారం రోజు ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ సందర్శించారు. అనంతరం పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల కాంపౌండ్ వాలు,డైనింగ్ హాల్, వంటగది, టాయిలెట్స్ కు సంబంధించిన పనులను స్థానిక ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ సత్యం , సర్పంచ్ జయరామ్ సాగర్, ఎస్ఎంసి చైర్మన్ , ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area