మన ఊరు-మన చరిత్ర ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ గా డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ నియామకం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్29(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన చరిత్రను నిర్మించుకుంటున్న సందర్భంలో గ్రామాల చరిత్రను వెలికితీసేందుకు ” మన ఊరు- మన చరిత్ర” పేరుతో తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉన్నత విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు వర్క్ ను నిర్వహించబోతున్నారు.ఈ ప్రాజెక్టు వర్క్ కి నాగర్ కర్నూల్ జిల్లా కోఆర్డినేటర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ ను నియమించారు.ఇందులో ప్రతి గ్రామ చరిత్రను వెలికి తీయడం ద్వారా మొత్తం తెలంగాణ చరిత్రను నిర్మించడానికి అవకాశం ఉంది. గ్రామం పేరు, ఆ పేరు రావడానికి కారణం, అక్షరాస్యత, దేవాలయాల చరిత్ర, శాసనాలు, చేతివృత్తులు ,వ్యవసాయం, గ్రామ రెవిన్యూ రికార్డ్స్, పరిపాలనా పద్ధతి,వ్యాపారం, వ్యవసాయం, నీటి వనరులు,పాడి పరిశ్రమలు, ప్రత్యేక పండుగలు, జాతరలు, ఉద్యమాలు, సాహితీవేత్తలు,సంఘ సేవకులు, సాహితీపరమైన రాతప్రతులు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అడవులు, రవాణా సౌకర్యం ఇలా అన్ని విషయాలు ఇందులో చోటు చేసుకుంటాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని మల్లికార్జున్ తెలియజేశారు




