తెదేపా నేతలు
హైదరాబాద్: తమను విమర్శించే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు, ఏ రాజకీయ పార్టీకి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబసభ్యులు నీతిమంతులే అయితే తమపై వచ్చిన అరోపణలకు సీబీఐ విచారణ కోరాలని ఆ పార్టీ తెలంగాణ ఫోరం నేతలు డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెను ప్యాకేజీ పేరుతో ఐదు వందల కోట్లకు అమ్ముకున్నారని వారు దుయ్యబట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్‌కు అమ్ముకుంది కేసీఆర్ కాదా అని వారు ప్రశ్నించారు. తెరాస నేతలే నిజమైన తెలంగాణ ద్రోహులని వారు మండిపడ్డారు.




