Wednesday, 4 November 2026

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో దొంగల బీభత్సవం

విశాఖ, విశాఖలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టంచారు. దేశపాత్రునిపాలెంలో ఉండే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ వాసు శ్రీ ఇంట్లో చొరబడి దొంగలు 50 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అంతేకాకుండా అడొచ్చిన వాసు శ్రీ ఆమె భర్త శేషగిరిరావులను తాళ్లతో కట్టేసి చితకబాదారు.
తీవ్రంగా గాయపడిన శేషగిరిరావు దంపతులను స్టీల్‌ ప్లాంట్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో నగరంలోని కార్పోరేట్‌ ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. కాగా 48 గంటలు గడిస్తేనే గాని ఏమి చెప్పలేమని వైద్యులంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *