Thursday, 5 November 2026

మరింతగా పెరగనున్న ఎండల తీవ్రత 

జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు
ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): ఓ వైపు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నా ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా  వేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో  భిన్న వాతావరణం ఉంటోంది. గతేడాది సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా నమోదైంది. ఎండలు కూడా ఆదే తరహలు ఉంటున్నాయి. ఎండల త్రీవత మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మోహన్‌దాస్‌ తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడూ జూన్‌ నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలతో ఆకాశం మేఘావృతమై వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి.నీటి వసతి లేని రైతులు తొందరపడి చేలలో విత్తనాలు వేస్తే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాతావరణం పూర్తిగా చల్లబడ్డాకే విత్తులు వేసుకోవడం మంచిందని సూచించారు. ఆకాశం మేఘావృతం..వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా రానున్న నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ప్రజలు ఎండల తీవ్రతకు అల్లాడి పోతున్నారు. వేడి తీవ్రత నుంచి ఉపశమనానికి కొబ్బరి నీళ్లు, తర్బుజా, పండ్ల రసాలు, ఇతర పానీయాలు తాగుతున్నారు. ఎండలు మండుతుండడంతో  ఆయా మండల కేంద్రాల్లో కుల్‌డ్రింక్‌ షాపులు, జ్యూస్‌ సెంటర్లు వెలిశాయి. ఎండలో
తిరిగే వాహనదారులు, కార్యాలయాల్లో పని చేసేవారు, ఫీల్డ్‌ వర్క్‌ చేసేవారు వేడిమికి తట్టుకోలేక కాసేపు సేద తీరి వాటి రుచిని ఆస్వాదిస్తున్నారు. వడదెబ్బతో ప్రజలు ప్రతి ఏడాది అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. రికార్డు స్థాయి ఎండలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటిందంటే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం 6  గంటలు దాటినా వేడి తగ్గడం లేదు. మధ్యాహ్నం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఎండల బారి నుంచి రక్షణ పొందాలంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో  ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం పూట తప్పా మధ్యాహ్నం అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది.  రానున్న నాలుగు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా మారుల్పు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
—————–