Friday, 6 November 2026

మరుగుదొడ్లు లేకుంటే అంటువ్యాధులు తప్పవ్‌

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ సూచించారు. వర్షాకాలంలో బహిరంగ మలవిసర్జనతో వాలే ఈగలు, దోమలతో ఎలాంటి వ్యాధులు వస్తాయో ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులలో చర్చజరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అతిసారం, రక్తహీనత, ఇతర వ్యాధులు రాకుండా ఉండాలంటే .. వారికి మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజానికి హితం చేసే మరుగుదొడ్ల నిర్మాణంలో మాత్రం ముందుండటం ప్రతిఒక్కరు గ్రహించాలని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇంటింటికి నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. అధికారులు ఎంపికైన గ్రామాలకు వెళ్లి గ్రామంలోని మహిళాసంఘాలు, యువకులు, గ్రామాభివృద్ధి కమిటీలతో పాటు ప్రజాప్రతినిధులను చైతన్యపర్చి వందశాతం నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనర్థాలను విడమర్చి చెప్పాలని పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా రూపొందించడంఆదర్శంగా తీసుకుని జిల్లాను తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇదివరకే నిర్మించుకున్న వ్యవక్తిగత మరుగుదొడ్లను పరిశీలించాలని అన్నారు. ఈపరిస్థితిలో మార్పు తీసుకరావాల్సిన అవసరముందనిచెప్పారు. ప్రధానంగా చెప్పినమాటకు కట్టుబడి మరుగుదొడ్లు నిర్మించుకునేవారికి సకాలంలో బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. గ్రామస్థులు ఎంత చెప్పినా పట్టించుకోకపోతే చివరిప్రయత్నంగా రేషన్‌బియ్యం, నల్లాకనెక్షన్లను తొలగిస్తామని, ఆస్తిపన్నులు రెట్టింపు చేస్తామని హెచ్చరించాలని సలహానిచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కృషిచేసే అధికారులను గుర్తిస్తామని తగు ప్రొత్సహం అందిస్తామని చెప్పారు. అదేసందర్భంలో నిర్లక్ష్యం చేసేవారిని ఉపేక్షించేదిలేదని సున్నితంగా హెచ్చరించారు.