జోగులాంబగద్వాల,సెప్టెంబర్18(జనంసాక్షి): గాంధీజయంతి అక్టోబర్ 2 నాటికి ఎంపిక చేసిన గ్రామాలలో
మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతోపాటు ఇంకుడు గుంతలు నిర్మించుకుని భూగర్భ జలాల వృద్ధిని పెంచాలని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు.పల్లెల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ఉదృతంగా చేపడుతోందని, అందులో భాగంగానే ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు విధిగా నిర్మించాలనే లక్ష్యంతో జిల్లాలో మొదటి విడతలో 36 గ్రామాలను వోడీఎఫ్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సైని పేర్కొన్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 36 గ్రామాలలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.




