వచ్చిన విరాళం మొత్త లక్షన్నర వరదబాధితులకు అందచేత
తిరువనంతపురం,ఆగస్ట్18(జనం సాక్షి): కాలేజీ యూనిఫామ్‌లో చేపలు అమ్ముతూ సోషల్ విూడియాలో ట్రోలింగ్‌కు గురైన కేరళ విద్యార్థిని హనన్ హవిూద్ ఇప్పుడు మరోమారు వార్తల్లోకి ఎక్కారు. వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదకుకనేందుకు ముందుకు రావడం ద్వారా తన ఔదార్యాన్ని చాటారు. ఛోటామోటా నాయకుల చెంప ఛెళ్లుమనిపించేలా రాష్ట్రంలోని వరద బాధితుల కోసం రూ.1.5 లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తనను ఆదుకునేందుకు దాతలు పంపిన విరాళాలు మొత్తం వరద బాధితులకే ఇవ్వదల్చుకున్నట్టు ప్రకటించింది. ప్రజల నుంచి నాకు అందిన విరాళాలను తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వారంతా కష్టాల్లో ఉన్నారు. నేను వారికి చేయగలిగిన కనీసం సాయం ఇదేనని హనన్ పేర్కొంది. ఆమె ఔదార్యాన్ని తోటి స్నేహితులు కూడా అభినందించారు. త్రిస్సూర్‌కి చెందిన హనన్ హవిూద్ ప్రస్తుతం బీఎస్సీ చదువుతోంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ప్రతిరోజూ కాలేజీ పూర్తయిన తర్వాత రద్దీగా ఓ కూడలిలో ఆమె చేపలు అమ్ముతూ ఉంటుంది. అయితే ఆమె పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా చేస్తోందంటూ కొందరు సోషల్ విూడియాలో వేధింపులకు దిగడంతో వివాదం రేగింది. బతుకుదెరువు కోసం ఆమె చేస్తున్న పోరాటంపై సీఎం పినరయి విజయన్‌తో పాటు అనేక మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. పలువురు దాతలు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ట్రోలింగ్ జరిగిన రెండో రోజు నుంచే నా అకౌంట్లోకి రూ.500 నుంచి రూ. 2000 వరకు విరాళాలు రావడం మొదలైంది. ఇప్పటి వరకు అవి మొత్తం రూ.1.5 లక్షలు అయ్యాయి. నాకు అండగా నిలిచిన ప్రజలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ల డబ్బును తిరిగి ఇచ్చేయాలని నేను భావిస్తున్నానని హనన్ పేర్కొంది. తనకు వచ్చిన విరాళాలను తిరిగి ఇచ్చేస్తాననీ.. కాలేజీ తర్వాత కష్టపడి సంపాదించిన సొమ్మును మాత్రమే తనతో ఉంచుకుంటానని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం డబ్బులు డిపాజిట్ చేసేందుకు మొబైల్ కనెక్టివిటీగానీ, బ్యాంకులు గానీ పనిచేయడం లేదనీ.. డిపాజిట్ చేసేందుకు వీలుకాని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రిని కాలిసి చెక్కు అందజేస్తానని తెలిపింది.
————–




