Tuesday, 3 November 2026

మరోసారి చార్జీల వడ్డన : ఆర్టీసీ

హైదరాబాద్‌ : ప్రయాణికులపై అభివృద్ధి సర్‌ఛార్జిల పేరిట డిసెంబర్‌ 1వ తేది నుంచి ప్రతి టికెట్‌పై ఒ్క రూపాయి విధించాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ మాసంలో ఆర్టీసీ యాజమాన్యం ఛార్జీలు పెంచిన సంగతి విదితమే. అయితే సీటి బస్సులు, పల్లె వెలుగు లాంటి సహసాధారణ సర్వీసుల్లో దూరానికి అతీతంగా ప్రయాణానికి 50 పైసలు వసూలు చేస్తారని ్‌ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. దీంతో వచ్చే 5నుంచి 6 నెలల్లో రూ.130 కోట్ల అదనపు ఆదాయాన్ని పోందావచ్చాని ఆర్టీసీ అధికారులు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ ఒక కోటి మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఒక అంచనా. తద్వారా సర్‌ఛార్జీ రూపేణా రోజుకు రూ.75 లక్షలు వసూలు చేయావచ్చాని ్‌ఆర్టీసీ యాజయాన్యం ఆశిస్తుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *