మల్టీపర్పస్ వర్కర్స్ విధానానికి వ్యతిరేకంగా పోరాడుదాం.

తోర్రుర్ 8 ఆగష్టు (జనంసాక్షి)తెలంగాణ ప్రగశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్( ఐ ఎఫ్ టి యు) మహబూబాబాద్ జిల్లా  తొర్రూర్ మండలం లో ఎంపీడీవో కుమార్ సార్ కి మండలంలోని గ్రామపంచాయతీ సిబ్బంది అందరూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రంలో గ్రామపంచాయతీలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించడం మండల అధ్యక్షులు గాదరబోయిన సంతోష్ మాట్లాడడం జరిగింది దీనిలో భాగంగా రాజు ,మహేష్ ,ఎండి యాకుబ్ పాషా, దేవేందర్, క్రాంతి కుమార్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు గ్రామపంచాయతీ వర్కర్లతో గ్రామ పంచాయతీ వర్కర్లకు గుది బండగ మారిన మల్టీపర్పస్ విధానాన్ని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని, సిబ్బంది వేతనాలు పెరగాలని కేటగిరి వారిగా ఎవరి పనులు వారికి ఉండాలని డిమాండ్ చేశారు.