మల్లాపూర్ లోసామూహిక జాతీయగీత ఆలపించారు .

మల్లాపూర్ ( జనం సాక్షి) ఆగస్టు:16

భారత స్వతంత్ర వజ్రోత్సవాలు భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త సామూహిక జాతీయ గీతాలాపన ఉదయము11:30 నిమిషాలకు కార్యక్రమం లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలో భరతమాత విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మల్లాపూర్ ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ కాటిపెళ్లి సరోజన, ఎంపీడీవో రాజ శ్రీనివాస్, తాసిల్దార్ రవీందర్ ,పలు పాఠశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనీ జాతీయ గీతం ఆలపించారు. అలాగే అన్ని గ్రామాలలో ప్రధాన కూడలిలో సామూహిక జాతీయగీతం ఆలపించారు ఆయా కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు