మల్లాయిగూడెం లో సాగుతున్న పోడు సర్వే
గిరిజనుల కు అండగా పాల్గొన్న సర్పంచ్ రాజశేఖర్
అశ్వారావుపేట, అక్టోబర్ 18(జనంసాక్షి,)
గిరిజన రైతు లు పక్షాన ఉండి పోడు భూములు సర్వే లో పాల్గొని అవకతవకలు తావు లేకుండా ఆదర్శంగానిలుస్తున్నమండల సర్పంచ్ ల సంగం అధ్యక్షులు నారం రాజశేఖర్ కు గిరిజనులు అభిందనలు తెలుపుతున్నారు.
మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీలో మంగళవారం జరుగుతున్న పోడు సర్వేలో
సర్పంచ్ రాజశేఖర్ పాల్గొన్నారు.
అనంతరం పోడు రైతులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ లో బిఆర్ స్ పార్టీ గిరిజనుల అభివృద్ధి విషయం లో గాని,అన్ని రంగాలలో గిరిజనులు ముందుండాలని ఆలోచించే ఏకైకైక ప్రభుత్వం అని బిఆర్ స్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సర్వే నిర్వహించడం లో ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విఫ్ శ్రీ రేగా కాంతారావు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మెచ్చా నాగేశ్వరావు పట్ల పోడు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో బీట్ ఆఫీసర్, సెక్రటరీ, ఆర్ ఎఫ్ సి కమిటీ సభ్యులు, పోడు రైతులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.