మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షణీయం :
కొండమల్లేపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి :
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్
నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కర్నాటక సీనియర్ నేత ,
దళిత వర్గానికి చెందినటువంటి మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో నిలిపి అధ్యక్ష పదవికి ఎన్నిక చేయడం
ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజలందరికీ సమానమైన స్థానం ఇస్తుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కుల, మతలను కలుపుకొని సమైక్యతా భావాన్ని వ్యక్త పరిచే పార్టీ అని అన్నారు. దేశ ప్రజలందరూ ఎన్నికల సమయంలో దేశంలో సమైక్యతా పార్టీవైపు ఉండి దేశ సమైక్యత స్ఫూర్తి చాటి దేశ ప్రజలందరి అభివృద్ధికి, దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
Attachments area