మల్లికార్జున దేవస్థానం 66వ వార్షికోత్సవ వేడుకలు

మల్లికార్జున దేవస్థానం 66వ వార్షికోత్సవ వేడుకలువికారాబాద్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున దేవస్థానంలో 66వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
వికారాబాద్ పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి  పర్వదినాన్ని పురస్కరించుకొని  66వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి, నంది ధ్వజం స్థాపన చేసి, స్వామి వారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి  అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త డాక్టర్ ముద్దా దీప భక్తవత్సలం గారు మరియు ఆలయ అర్చకులు బసవరాజ్ స్వామి సాంబశివశర్మ నాగేశం సామి శ్రీకాంత్  చందు స్వామి మల్లికార్జున్ భాను ప్రకాష్ కళ్యాణ్ స్వామి మరియు వికారాబాద్ వీరశైవ సమాజం ఉపాధ్యక్షులు బుచ్చప్ప మరియు కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ శ్రవణ్ కుమార్ కిరణ్,అక్క మహాదేవి మహిళ  విభాగం మరియు యువదల్ సభ్యులు అధ్యక్షులు కిషోర్ ఉపాధ్యక్షులు భాను చందర్ కాశెట్టి శివానంద్ సంతోష్ శివ కుమార్ కోటిలింగం తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు