Wednesday, 4 November 2026

మల్లేశం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన-జయచంద్రారెడ్డి.

కూసుమంచి ఫిబ్రవరి 12 (జనం సాక్షి): మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన దేశ బోయిన మల్లేశం కుటుంబానికి తెరాస మండల నాయకులు సోలిపురం జయచంద్రారెడ్డి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మల్లేశం కుమారుడైన దేశ బోయిన హేమంత్ కుమార్ కు జయచంద్రారెడ్డి తండ్రి సోలిపురం వెంకటరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ నాయకులు గడ్డం వెంకటరమణ, కాసాని నరేష్, స్థానిక గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ షేక్ మల్సూర్ అలీ, మరియు దేశ బోయిన మల్లేశం కుటుంబ సభ్యులైన దేశ బోయిన ఏడుకొండలు, దేశమైన సైదులు, దేశ బోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు