Tuesday, 3 November 2026

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం – అంబేద్కర్, పూలే విగ్రహాల ఏర్పాటు భూమి పూజలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం – అంబేద్కర్, పూలే విగ్రహాల ఏర్పాటు భూమి పూజలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటలకి నివాళులు అర్పించి వారి విగ్రహాల నిర్మాణానికి మంథని బీ.ర్.ఎస్ .ఎమ్మెల్యే అభ్యర్థి. పెద్దపల్లి జడ్పీ.చైర్మన్ పుట్ట మధుకర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్. వార్డు సభ్యులు సాగర్ రావు, మేకల ప్రశాంత్, ముత్యాల పుష్పాలత, రామగిరి సౌందర్య, జనగామ రాజు, మహనీయుల విగ్రహాల కమిటీ మంథని నియోజకవర్గ చైర్మన్ తగరం శంకర్ లాల్, రామగిరి జడ్పీటీసీ మ్యాదరవేన శారదా, నాయకులు కొండ శ్రీనివాస్, లక్కకుల శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం రామగిరి మండల అధ్యక్షుడు కుడిది చలం, దాసరి సాయి. వంశీ, ప్రేమ్,సందీప్ సంపత్, సతీష్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.