మహాత్మా గాంధీ చిత్రపటానికి కి వినతి పత్రం అందించిన విఆర్ఏ ల మండల జెఏసి నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 70వ రోజున దీక్షా శిబిరం లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ముఖ్య మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన వీఆర్ఏలకు పే స్కేల్, అర్హులకు ప్రమోషన్స్,55 సం నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాల పన్నెండు రోజులు గడిచినా ఇప్పటి వరకు జీఓ విడుదల చేయక పోవడం తో ఈరోజు మండలం లోని వీఆర్ఏ లు నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల జెఏసి ఛైర్మన్ శీలం రాజు, కో చైర్మన్ చాగంటి శివ కోటి, కోరే శోభారాణి, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్, కన్వీనర్ లు స్రవంతి రమేష్ సునీల్ శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్ కాంతయ్య, రాజ్య లక్ష్మి, సారంగపాణి, సలీం తదితరులు పాల్గొన్నారు.