కూకట్ పల్లి జనంసాక్షి :జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు మరువలేనివని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్చనపల్లి సూర్యారావు అన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ లోని తూర్పు కమాన్ (గావిన్) వద్ద ఏర్పాటుచేసిన గాంధీ,శాస్త్రి చిత్రపటాలకు సూర్యారావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పరిసర ప్రాంతాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మదరి పవన్ కుమార్, డివిజన్ నాయకులు బాల కుమార్, సాయికుమార్, కార్తీక్,రాఘవేందర్, ప్రసాద్, బాలరాజ్,రాము, మనోహర్ అఖిల్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం
శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లిలో డివిజన్ పాపిరెడ్డి నగర్, ఆస్బెస్టాస్ కాలనీ, కార్యాలయం వద్ద అధ్యక్షుడు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంగుల రాజిరెడ్డి, శ్రీకాంత్ యాదవ్, మహిళా మోర్చా లతా, సందయ, అనిత, జిల్లా నాయకులు బాలు యాదవ్, శ్రీధర్ పటేల్, గోవర్ధన చారి, సీనియర్ నాయకులు నరేష్, శ్రీనివాసరెడ్డి, రాము,సుధీర్ సింగ్, సుధాకర్, వెంకట్, ప్రకాష్ రావు, ప్రభాకర్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




