Tuesday, 3 November 2026

మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

ధర్మపురి ( జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన ధర్మపురి మహాత్మ జ్యోతి భాపులే డిగ్రీ విద్యార్థులు ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో నిర్వహించినటువంటి ఆటల పోటీలలో మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో చదువుతున్న D. విష్ణువర్ధన్,A. హరీష్ అండర్ 20 విభాగంలో విద్యార్థులు ఉత్సాహంగా పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ రాదాకిషన్, ఫిజికల్ డైరెక్టర్ అంజయ్య మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించడం జరిగిందని ఫిజికల్ డైరెక్టర్ అంజయ్య జనం సాక్షి మీడియాకు తెలిపారు.