Monday, 2 November 2026

మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు.

 

– నిమ్మ దబ్బలతో ప్రత్యేక దీపాలంకరణ.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటుచేసిన శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. భవాని మాలా ధారణ స్వాములు బొల్లు సాంబశివరావు స్వామి, డేగల ధర్మయ్య స్వామి, జక్కం శశిశేఖర్ దుర్గాసాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు సత్యవ్రతా శర్మ, శ్రీనివాస శాస్త్రి ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ముందు నిమ్మదబ్బలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దీపాలంకరణ భక్తులకు కనువిందు చేసింది. దీపాలంకరణ అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరణ గావించారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి జగదీష్ ,భవనం చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల కృష్ణ భక్తులు పాల్గొన్నారు.