Wednesday, 4 November 2026

మహాసభను విజయవంతం చేయాలి

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 13
ఈనెల 18న కరీంనగర్ లో నిర్వహించే 2వ మహాసభను విజయవంతం చేయాలని, సిఐటియు అనుబంధ సంస్థ పబ్లిక్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభ కరపత్రాలను రవి ముఖ్య అతిథి హాజరై ఆవిష్కరించారు. ఏఐఆర్ టి డబ్ల్యూ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ. కరీంనగర్ కోతి రాంపూర్ లో గల సిఐటియు భవనంలో ఈ నెల 18 రెండవ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలకు కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో విజయంతో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాలీ మండల అధ్యక్షుడు తాడిచర్ల తిరుపతి, ప్యాసింజర్ ఆటో యూనియన్ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్, ట్రాలీ యూనియన్ నాయకులు గడ్డం రవి, శ్రీకాంత్, సుమన్ సాజిత్ తదితరులు పాల్గొన్నారు.