మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీ జే పీ యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి
జనం సాక్షి, నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని కోర్టు ప్రక్కన “శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవ కమిటీ ” సభ్యులు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీజేపీ యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కనకదుర్గా దేవి ఆశీస్సులు రైతులపై, మన అందరి పై ఆ తల్లి కృపా కటాక్షాలు అందరి పై పడి అందరూ సుఖ సతోషాలతో వుండాలని, ఆ తల్లి చల్లటి దీవెనలతో అంతా మంచే జరుగుతుందనీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవ కమిటీ సభ్యులు నాగరాజు, నరేష్,గోపీ, భాస్కర్, కోటేశ్వరావు, విజేందర్, కొమురయ్య,యాదగిరి,సదానందం, సాంబమూర్తి,సదానందం, సాయిగణేష్, భార్గవ్, రాజు, చిరంజీవి, బ్రహ్మాచారీ తదితరులు పాల్గొన్నారు.