Wednesday, 4 November 2026

మహా నగరానికి బారులు…

విజయవాడ : విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై రెండోరోజు కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.  సోమవారం తెల్లవారు జామున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పతంగి, కార్లపహాడ్, భీమవరం టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, కోఠి, చాదర్ ఘాట్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ జామ్ అయింది.

సంక్రాంతి పర్వదినానికి హైదరాబాద్ మహానగరం విడిచి వెళ్లిన వారంతా మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల వాహనాలు తిరుగుతుండగా, ప్రస్తుతం 30 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సంక్రాంతి పండగ ముందు తమ స్వగ్రామాలకు వెళ్లారు. పండుగ ముగియడం..దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి విజయవాడ వైపు నుంచి వాహనాల రద్దీ పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *