హైదరాబాద్,ఆగస్ట్6(జనం సాక్షి): పాతబస్తీలోని పలువురు మహిళలపై ఓ దుండగుడు పెప్పర్ స్పేత్రో దాడికి తెగించాడు. స్పే చల్లడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. కలకలం సృష్టించిన ఈ ఘటన కాలాపత్తర్‌లోని ఇందిరానగర్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆరుగురు మహిళలతో పాటు బాలుడిపై యాసిర్ అహ్మద్ అనే దుండగుడు అకస్మాత్తుగా పెప్పర్ స్పే చల్లాడు. బాధితులు కేకలు వేయగా స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అయితే కొంతకాలంగా అతను మహిళలపై పెప్పర్ స్పే చల్లుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితులను ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.




