మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి* హంస ఫౌండేషన్ మండల బాధ్యులు ఎస్ కె చాంద్
మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని హంస ఫౌండేషన్ మండల బాధ్యులు ఎస్ కె చాంద్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో హంస ఫౌండేషన్ ఉచిత కుట్టు మిషన్ కేంద్రంలో ప్రజా సేవకుడు తొలిమలి దశ తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు హంస ఫౌండేషన్ మండల బాధ్యులు ఎస్ కె చాంద్ మాట్లాడుతూ మహిళలు ఇష్టంతో కుట్టు మిషన్ నేర్చుకోవాలని ఆర్థికంగా ఎదగాలని కోరారు. పేద మహిళలకు దాతల సహకారంతో వారికి ఉచిత కుట్టు మిషన్ నేర్పించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్యూటర్ ఉప్పల హంస, పి రవి ,డి శోభ , ఎస్ ఉమా, లక్ష్మి కే శారద, ఏం మధురిమ, మైమున సిహెచ్ తులసి, బి ప్రశాంతి ముంతాజ్ బేగం, నాగలక్ష్మి ప్రసన్నలక్ష్మి, శ్రీలక్ష్మి భవాని, కె హర్తి, షరీన్ తదితరులు పాల్గొన్నారు.
