Tuesday, 3 November 2026

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి- సిఎస్ఓ అచ్యుతరావు -కిసాన్ పరివార సంస్థ ఆధ్వర్యంలో పచ్చళ్ళ తయారీ విధానం పై అవగాహన సదస్సు
కురివి మార్చి /28/ జనం సాక్షి న్యూస్:మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని కిసాన్ పరివార్ సంస్థ సీఎస్ఓ అచ్యుతరావు,డీపీఎం నళిని నారాయణ అన్నారు. మంగళవారం కురవి మండలంలోని సూదనపల్లి గ్రామంలోని కిసాన్ పరివార్ సంస్థ ఫాంహౌస్ లో పచ్చళ్ల తయారి విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పచ్చళ్లు తయారు ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. ఉమెన్ ఆన్ రన్ ప్రోగ్రాం భాగంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం మరియు పోషకాహారం పై విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి అవగాహన కల్పించి ఆటల పోటీలను నిర్వహించారు మంచి ఆహారం ఉన్నచోటే మంచి ఆరోగ్యం కూడా ఉంటుందని కిసాన్ పరివార్ సంస్థ సీ.యస్.ఓ అచ్యుతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నళిని నారాయణ,  డీపీఎం ఎం చంద్రశేఖర్, ఎపీఎంలు  ఆర్ కిరణ్ కుమార్, ఏ శ్రీనివాస్ , తిలక్ కుమార్ ,  మహమూద్,  బి బాబు, సీసీలు సతీష్,  నాగిరెడ్డి, సంస్థ సభ్యులు యుగంధర్,మహేష్, రమణ, ఖలీల్, సంతోష్,  లవన్ ,బిక్షపతి ,పవన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.