Wednesday, 4 November 2026

మహిళలు బలమైన సమాజాన్ని ఏర్పరచాలి. -డాక్టర్ లావణ్య .

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, మార్చి 8(జనంసాక్షి):
శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలు దూసుకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలను ప్రపంచానికి సరిపోయేలా తయారు చేయడం కాకుండా ప్రపంచాన్ని మహిళలకు సరిపోయేలా తయారు చేయడం గురించి ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని డాక్టర్ లావణ్య కోరారు బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా లోకానికి ఆమె పలు సూచనలు చేశారు. గ్లోరియో స్టేయిన్ ఆలోచనల ప్రకారం మహిళలు గృహిణిగా ప్రేమికుల భార్యగా శ్రద్ధ వహించే తల్లిగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబాన్ని ఆర్థిక ప్రయోజకులుగా మార్చడంతో పాటు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యేక కృషితో ముందుకు సాగుతారని అలాంటి మహిళలను చిన్నచూపు చూడడం దారుణమని అన్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడవలసిన పాలకులు మహిళలకు రక్షణ కరువే విధంగా సమాజంలో అనేక సంఘటనలు జరుగుతున్న దోషులను శిక్షించడంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నేడు సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పితృస్వామ్య వేధింపులను నేటికీ ఎదుర్కొంటున్నారని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నవజాత శిశువులను సమాజానికి పరిచయం చేస్తుందని వివరించారు.మహిళలు బలమైన నిర్ణయాలను తీసుకొని వారి కుటుంబాలకు ఒక రోల్ మోడల్ గా నిలవడం జరుగుతుందని అన్నారు మహిళా దినోత్సవం రోజు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా వారిని బలమైన సమాజం ఏర్పరచుకునేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.